Maganti Sunitha | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను (Maganti Sunitha) పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా మాగంటి సునీత మాట్లాడారు. మాగంటి గోపీనాథ్‌పై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చారు. నాపై విశ్వాసంతో ఉప ఎన్నికకు అభ్యర్థిగా అవకాశం కల్పించారు. అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజల మద్ధతు, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని మాగంటి సునీత పేర్కొన్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమయింది. దీంతో పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్ధిగా ఎంపిక చేశారు. తద్వారా చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ, జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.