Interstate Gang Arrest | అంతర్రాష్ట్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్.. ఐదు మోటర్ సైకిళ్లు స్వాధీనం
Interstate Gang Arrest | ద్విచక్రవాహనాలను చోరీ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట దొంగల ముఠాను మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మక్తల్: ద్విచక్రవాహనాలను చోరీ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులు గల అంతర్రాష్ట దొంగల ముఠాను (Interstate Gang Arrest ) మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య (DSP Lingaiah) తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ రామ్ లాల్‌తో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు.
ఈనెల 6న మక్తల్ పట్టణంలోని రహమానియ కాలనీలో, ఇంటి ముందు ఆపి ఉన్న హోండా షైన్బైక్ను దొంగలించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మక్తల్ సీఐ రామలాల్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించగా శుక్రవారం ఉదయం మక్తల్ సబ్ స్టేషన్ ఎదుట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో నిందితులు బైకులకు పెట్రోల్ కొట్టించుకున్న సందర్భంలో మక్తల్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారని తెలిపారు. వారి దగ్గర ఉన్న రెండు వాహనాలతో పాటు మరొక మూడు వాహనాల సమాచారం బయటపడిందని తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన కుంచు కోరం ఎల్లప్ప , సన్న దుర్గప్ప అలియాస్ దుర్గేష్, వీర పాపర్ వాహనాల చోరీకి పాల్పడుతున్నారని వివరించారు. దొంగిలించిన వాహనాలను యాదగిరి జిల్లా బసవేశ్వర నగర్‌కు చెందిన శంషుద్దీన్ విక్రయించేవారని తెలిపారు. వీరి వద్ద నుంచి వివిధ జిల్లాల నుంచి 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి, కృష్ణ ఎస్సై ఎండీ నవీన్ , క్రైమ్ స్టాప్ శంకరయ్య, ఏఎస్సై, కానిస్టేబుల్ అశోక్, శ్రీకాంత్, శశిధర్, భరత్, సంపత్‌ను అభినందించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

