ఆగండి బ్రదర్ అంటూ ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిని సోదరులలా భావించే ఎన్టీఆర్ తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానులపై గరం అయ్యారు. ఆపండి బ్రదర్.. స్టాప్ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళితే ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శ్రీ సింహా కోడూరి హీరోగా తెల్లవారితే గురువారం చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. మార్చి 27న మూవీ విడుదల చేయనున్న క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో మాట్లాడిన ఎన్టీఆర్.. అభిమానుల అరుపులకు చాలా ఎనర్జీ వస్తుంది. అయితే చాలా తక్కువ సార్లు మాట్లాడడంలో ఇబ్బంది పడుతుంటాను. రేపొద్దున అభయ్, భార్గవ్ గానీ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. వారి గురించి చెప్పేందుకు మాటలు సమకూర్చుకుంటున్నాను. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి అని ఎన్టీఆర్ అన్నారు.
అయితే ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం సీఎం అంటూ అరవడంతో ఓపిక నశించిన జూనియర్ … ఆగండి బ్రదర్, స్టాప్ అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డెన్ శారీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన శ్రియా శరణ్.. హాట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న బ్యూటీ!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’కు ఇద్దరు సంగీత దర్శకులా .. అసలు కథేంటి?
Nallagonda | హాల్‌టికెట్లు ఇచ్చి.. ఫీజులు వసూలు చేసి.. తీరా పరీక్ష రద్దుపై తల్లిదండ్రుల ఆందోళన
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

