సినీ పరిశ్రమలో పోటీతత్వం ఎలా వున్నా.. ఒకరి సినిమాలు విజయం సాధిస్తే.. మరొకరు అభినందనలు తెలపడం సహజమే. అయితే తాము నటించని సినిమాలు విజయం సాధించినా వాళ్లకంటే ఎక్కువగా హ్యపీగా ఫీలయ్యే సినిమాలు, ఆ సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి.. అలాంటి ఓ సందర్భమే ఇప్పుడు కథానాయకుడు ఎన్టీఆర్, మరో కథానాయకుడు అల్లు అర్జున్‌ది.
ఆగస్టు 15న మూడు పెద్ద సినిమాల పోటీలో బరిలో నిలిచిన చిత్రం ‘ఆయ్’. దాదాపు అందరూ కొత్తవాళ్లు, ఒకటి రెండు సినిమాల అనుభవం వున్న ఆర్టిస్టుల సినిమాలతో రూపొందించిన చిత్రమిది. పెద్ద సినిమాల బరిలో నిలిచిన ఈ చిత్రం ఫైనల్‌గా ఆగస్టు 15న విడుదలైన చిత్రాల్లో విజేతగా నిలిచింది.
పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి అటు ప్రేక్షకుల నుంచి, ఇటు విమర్శకుల నుంచి మంచి స్పందనే కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన నార్నే నితిన్, స్టార్హీరో ఎన్టీఆర్ భార్య ప్రణతికి తమ్ముడు… అంటే ఎన్టీఆర్‌కు బావమరిది. ఇక ఈ సినిమాను నిర్మించింది. అల్లు అర్జున్ అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు బన్నీవాస్.. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా వాళ్ల సపోర్ట్ ఈ సినిమాకు వుంది.
ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ పాల్గొనాల్సి వుంది. అయితే ఎన్టీఆర్ దేవర షూటింగ్లో, అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో బిజీగా వుండటం వల్ల కుదరలేదు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసి పరోక్షంగా ఈ చిత్రం ఓపెనింగ్స్‌కు కారణమయ్యారు. అయితే ఇప్పుడు ఆయ్ చిత్రం విజయం సాధించడంతో… ఇద్దరూ హ్యపీగా వున్నారు.. సో..ఒక సినిమా సక్సెస్ ఇద్దరూ స్టార్ హీరోలను హ్యపీ చేసిందని అంటున్నాయి సినీ వర్గాలు.