జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై జాప్యం తగదు
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని పలువురు జర్నలిస్టు సం ఘాల నాయకులు పేర్కొన్నారు. 18 ఏండ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి పేట్‌బషీరాబాద్,
- ప్రత్యేక జీవో ద్వారా స్థలాలు కేటాయించాలి
- ఇందిరాపార్కు వద్ద జేఎన్జే సొసైటీ సభ్యుల ధర్నా
కవాడిగూడ, నవంబర్ 3 : జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదని పలువురు జర్నలిస్టు సం ఘాల నాయకులు పేర్కొన్నారు. 18 ఏండ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి పేట్‌బషీరాబాద్, నిజాంపేటల్లో కేటాయించిన స్థలాలను సొసైటీ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇండ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జేఎన్జే సొసైటీ ఆధ్వర్యం లో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ధర్నాలో సీనియర్ పాత్రికేయుడు ఎంవీఆర్ శాస్త్రి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, టీడబ్ల్యూజేఎఫ్ రాస్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, తెలంగాణ రక్షణ సేన మీడియా విభాగం అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జేఎన్జే సొసైటీ నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు కుంచం శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వీ రవికుమార్, కో కన్వీనర్లు ఎం రవికుమార్, బ్రహ్మం తదితర సొసైటీ సభ్యులు, పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

