న్యూఢిల్లీ: భారత స్టార్ స్కాష్ ప్లేయర్ జ్యోష్న చిన్నప్ప తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. ప్రొఫెషనల్ స్కాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ ర్యాంకుల్లో టాప్-10కి దూసుకెళ్లింది. 3,878 పాయింట్లతో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని పదో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో సౌరవ్ ఘోషల్ 16వ స్థానానికి దిగజారాడు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల డబుల్స్‌లో జ్యోష్న-దీపిక పల్లీకల్ జోడీ స్వర్ణం సాధించి కొత్త అధ్యాయం లిఖించగా.. ఈ ఏడాది జరిగే టోర్నీలో తిరిగి జత కట్టాలనే భావనలో వారిద్దరూ ఉన్నారు.