పూణె: పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ జానీ బెయిర్‌స్టో అద్భుతమైన ఫీల్డింగ్‌తో లక్నో ప్లేయర్ దీపక్ హుడాను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడినా.. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి రాకెట్ లాంటి వేగంతో బెయిర్‌స్టో త్రో వేసి.. నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో హుడాను రనౌట్ చేశాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన కృణాల్ పాండ్యా రెండు రన్స్ తీశాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హూడా రెండవ రన్‌కు పరుగెత్తుతున్న సమయంలో.. ఆ సమయంలో బెయిర్ స్టో అలర్ట్‌గా ఉన్నాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో కుడి వైపు పరుగెత్తి బంతిని అందుకున్న బెయిర్‌స్టో .. ఆ తర్వాత దాన్ని రాకెట్ లాంటి వేగంతో నాన్ స్ట్రయికర్ దిశగా త్రో చేశాడు. క్రీజ్‌కు కొద్ది దూరంలో ఉన్న హుడా ఆ త్రోకు రనౌట్ అయ్యాడు. ఆ అద్భుతమైన ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో ఇదే.
— James Tyler (@JamesTyler_99) April 29, 2022