
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబరు 11 (నమస్తే తెలంగాణ): పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉన్నప్పటికీ… విద్యా సంవత్సర క్యాలెండర్ మాత్రం ఒక్కో వర్సిటీకి ఒక్కో రీతిన ఉండే విధానానికి స్వస్తి పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అన్ని వర్సిటీల్లో పీజీ కోర్సులకు ఉమ్మడి విద్యా క్యాలెండర్‌ను అమలు చేసేందుకుగాను సోమవారం ఆరు యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు సమావేశం అవుతున్నారు. ఇందులో ఉమ్మడి పీజీ విద్యా క్యాలెండర్‌పై విస్తృతంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పోస్టు గ్రా డ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఉ మ్మడి ప్రవేశ పరీక్ష కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. కానీ తదుపరి విద్యా క్యాలెండర్ మాత్రం యూనివర్సిటీకి ఒక్కోలా అమలవుతుంది. అడ్మిషన్లు మొదలు క్లాస్ వర్క్, పరీక్షలు ఇలా విద్యా సంవత్సరంలోని వివిధ దశలు ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా అమలు చేస్తున్నారు. తద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యలో భాగంగా డిగ్రీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఒకే విద్యా క్యాలెండర్ అమలవుతున్నట్లుగానే పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ అన్ని వర్సిటీల్లో అమలు చేయాలనే ప్రతిపాదన చాలా రోజులుగా ఉంది. దీనిపై ఒక విధానాన్ని రూపొందించేందుకుగాను సోమవారం ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్స్ సమావేశం అవుతున్నారు. ఇందులో అన్ని పీజీ కోర్సులకు సంబంధించి అన్ని యూనివర్సిటీల్లో ఒకే విద్యా క్యాలెండర్ రూపకల్పనపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పీహెచ్డీ అడ్మీషన్ల విషయంపైనా చర్చించనున్నారు.
ఇక…ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు డిగ్రీ కళాశాలలకు సంబంధించి అమలవుతున్న క్లస్టర్ విధానంపైనా వైస్ చాన్స్‌లర్స్ చర్చించనున్నారు. సాధారణంగా కొన్ని డిగ్రీ కళాశాలలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్‌లోని కళాశాలల విద్యార్థులు తమ గ్రూపులోని ఒక సబ్జెక్ట్‌ను ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఎలక్టివ్ సబ్జెక్టుకు సంబంధించి క్లస్టర్ పరిధిలోని ఏ కళాశాలలో మంచి ఫ్యాకల్టీ ఉంటారని భావిస్తారో అక్కడికి వెళ్లి ఆ సబ్జెక్ట్ క్లాసులకు హాజరుకావచ్చు. ఈ ఎలక్టివ్ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసు లు వారానికి ఒకసారి నిర్వహించనున్నా రు. దీని ద్వారా ఆయా కళాశాలల మధ్య ఫ్యాకల్టీలే కాకుండా మౌలిక సదుపాయాలు, వి ధానాలు, లైబ్రరీ తదితర అంశాల్లోనూ పంపిణీకి ఆస్కారం ఉంటుం ది. ఇప్పటికే నగరంలోని తొమ్మిది అటానమస్ డిగ్రీ కాలేజీలను క్లస్టర్ల ఏర్పాటుకుగాను ఎంపిక చేశారు.