హైదరాబాద్: ఎన్కెపల్లిలోని జేబీ గ్రూపు వ్యవస్థాపకులు జోగిన్‌పల్లి భాస్కర్‌రావు జయంతిని భాస్కర్ మెడికల్ కాలేజిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి(Chinna geeyar Swamy) ముఖ్యఅతిథిగా హాజరై భాస్కర్‌రావు సామాజిక సేవ ఔన్నత్యాన్ని, స్థిత ప్రజ్ఞతను గుర్తుచేశారు. 1988లో వరుణయాగం చేసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆశించారని, భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు వారి అడుగుజాడల్లో నడుస్తూ విద్య, వైద్య అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్కృత, తెలుగు, తమిళ భాషా పండితుడు సాతలూరి గోపాలకృష్ణమాచార్య స్వామివారిని, మాజీ ఎంపీ, విద్యావేత్త గోకరాజు గంగరాజును నిర్వాహకులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజ జీయర్స్వామిజి, దేవనాథ జీయర్‌స్వామి, నేపాల గోపాల కృష్ణమాచార్యలు పాల్గొని హిందూధర్మపురాణాల విశిష్టతను గొప్పగా వివరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌రావు సతీమణి వసుమతిదేవి, కుమారులు జేవీ కృష్ణారావు, వంశీధర్, కుమార్తె డా.బీ దీపిక, అల్లుడు రామ్మోహన్రావు, కోడలు ప్రొ.గాయత్రి, మనుమలు, మనుమరాండ్లు పాల్గొన్నారు.