ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ | ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు.

వాషింగ్టన్ : ప్రపంచ దేశాలకు 8 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో పాటు ఫైజర్ బయో ఎన్‌టెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ టీకాలు సైతం వచ్చే ఆరువారాల్లో అందించనున్నట్లు సోమవారం తెలిపారు. ‘ప్రపంచ దేశాల్లో మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉంటే.. అమెరికా సైతం క్షేమంగా ఉండలేదని పేర్కొన్నారు. వచ్చే ఆరువారాల్లో 80 మిలియన్ల టీకా డోసులు ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఆమోదం లభించలేదు. 60 మిలియన్ మోతాదుల నిల్వ ఉండగా.. ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్‌డీఏ) క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తోంది. అనుమతి లభిస్తే కంపెనీ వాటిని వివిధ దేశాలకు రవాణా చేయనుంది. 80 మిలియన్ డోసులు దేశంలోని టీకా ఉత్పత్తిలో 13 శాతం (జూన్ చివరి నాటికి) అని, రష్యా, చైనా కంటే ఎక్కువగా అమెరికా టీకాలను విరాళంగా ఇస్తుందని బైడెన్ పేర్కొన్నారు.
America will never be fully safe while this pandemic is raging globally. That’s why today, I’m announcing that over the next six weeks we will send 80 million vaccine doses overseas.
— President Biden Archived (@POTUS46Archive) May 17, 2021
It is the right thing to do. It is the smart thing to do. It is the strong thing to do.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

