కొవిడ్ కారణంగా ఎన్నో అవసరాలకు ఆన్లైన్నే ఆశ్రయించాల్సి వస్తున్నది. దీపావళి పటాకులు పేల్చడానికి కూడా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల పర్యావరణానికి నష్టం ఉండదు. శబ్ద కాలుష్యం ఉండదు. పైసా ఖర్చూ ఉండదు. గూగుల్ ప్లే స్టోర్‌లో దొరికే ‘దివాలీ క్రాకర్ సిమ్యులేటర్ ఫైర్‌వర్క్’ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని.. ఘనంగా పటాకుల పండుగ చేసుకోవచ్చు. ఆ శబ్దాలు వింటూ, ఆ రంగులు ఆస్వాదిస్తూ మురిసిపోవచ్చు. ‘దివాలీ క్రాకర్స్ సెలబ్రేషన్స్ అండ్ రిలాక్సేషన్’ అనే యాప్‌లో అయితే మనమే సొంతంగా పటాకులు సృష్టించుకోవచ్చు.