న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీజాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2027 పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలను జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనుండగా, ఆసక్తిగల అభ్యర్థులు jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన బోర్డుల నుంచి 10+2, ఇంటర్మీడియట్, ఎన్ఐఓఎస్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. దరఖాస్తులో భాగంగా అభ్యర్థులు వెబ్సైట్లో కోరిన ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత సైజులో అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.