ఈ యువతి శిరోజాలు అదరహో..!

సాధారణంగా అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టయిల్స్ చేయించుకునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకుతగినట్లుగా కురులను పెంచుకుంటుంటారు. అయితే, నాలుగు ఫీట్ల పొడవు దాటగానే అమ్మో ఎంత పొడవుగా మారాయో శిరోజాలు అంటూ మురిసిపోతూ.. వాటితో సరిగ్గా కొప్పులు ముడటవం రావడంలేదని సాకు చెప్తూ కత్తిరిస్తుంటారు. చివర్లు పగిలిపోతున్నాయని కొసలను కత్తిరింపునకు గురిచేస్తుంటారు మరికొందరు. ఇలా ఎవరికి తోచినట్లు వారు తమ తల వెంట్రుకలను పెంచుకుంటూ ఉండగా.. జపాన్‌కు చెందిన ఓ యువతి ఏకంగా 15 ఏండ్లుగా తల వెంట్రుకలపై కత్తెర వేయకుండా పెంచుకుంటుందంట. ఆమె వెంట్రుకలు ఇప్పుడు ఏకంగా 6 ఫీట్ల 3 ఇంచుల పొడవుగా పెరిగాయంట.
ఒకప్పుడు పొడవాటి వెంట్రుకలతో రాజసం ఒలకబోసిన రాపున్జెల్ అనే యువతి గురించి అప్పట్లో కథలు చెప్పుకునేవారు. అయితే, ఇప్పుడు రిన్ కాంబే అనే యువతి జపాన్‌కు చెందిన రాపున్జెల్గా ప్రసిద్ధి చెందింది. మోడలింగ్ ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ఈ 35 ఏండ్ల యువతి.. గత 15 ఏండ్లుగా తల వెంట్రుకలపై కత్తెర పెట్టలేదంట. ఫలితంగా అవి రికార్డు స్థాయిలో పెరిగి ఆమెకు పాపులారిటీని తీసుకొచ్చాయి. తన ఇరవయ్యో ఏట బుద్ధిజంలోకి మారిన ఈ యువతి.. అప్పటి నుంచి తల వెంట్రుకలను కత్తిరించడంలేదు. దాంతో ప్రస్తుతం ఈమె వెంట్రుకలు 6 ఫీట్ల 3 ఇంచుల పొడవుకు పెరిగాయి. ఆమె తన శిరోజాలు ఆరోగ్యంగా ఉండేందుకు కుంకుమపువ్వుతో తయారుచేసిన స్కాల్ప్ క్రీమ్‌ను తరచుగా పూస్తుంది. జుట్టును ఎప్పటికప్పుడు చూసుకోవడం సులభం కాదని రిన్ చెప్తున్నారు. సాధారణ పోషణతోపాటు పెరుగుదలను నిర్ధారించడానికి ఆమె ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృష్టిపెడుతున్నానన్నారు. ఒక ఆర్టిస్ట్‌గా శిరోజాలను బాగా పొడవుగా పెంచుకోవాలని అనుకుని 15 ఏండ్ల క్రితం కత్తిరింపును పక్కన పెట్టానని పేర్కొన్నారు. ఇది సహజమైన, అందమైన, సూపర్-పొడవాటి జుట్టు నృత్య వ్యక్తీకరణ ఆయుధంగా భావిస్తున్నట్లు రిన్ చెప్తోంది.
కాగా, గుజరాత్‌కు చెందిన నిలాన్షి పటేల్ అనే యువతి అతిపొడవైన శిరోజాలు కలిగివున్న యువతిగా 2018 లో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. మరుసటి ఏడాది మరింత పొడవు పెంచి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ యువతి శిరోజాలు 6 ఫీట్ల 7.8 ఇంచులుగా ఉన్నాయని గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులు ధ్రువీకరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

