తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్ నటిస్తున్న కొత్త సినిమా ‘వలీమై’. హ్యూమా ఖురేషి నాయికగా కనిపించనుంది. జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై బోనీకపూర్ నిర్మించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఐవీవై ప్రొడక్షన్స్‌లో గోపీచంద్ ఇనుమూరి తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ‘వలీమై’ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ…“మనవూరి పాండవులు’ సినిమా హిందీ రీమేక్‌తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. అజిత్‌తో ‘కాదల్ కోటై’, ‘వాలి’ చిత్రాలు నిర్మించాను. ‘వలీమై’ మూడో సినిమా. అజిత్, దర్శకుడు వినోద్ మంచి సినిమాను ఇచ్చేందుకు ఎంతైనా శ్రమిస్తారు. ఈ చిత్రంలో కార్తికేయ నటన ఆకట్టుకుంటుంది. మీకు కొత్త అనుభూతిని కలిగించే చిత్రమవుతుంది. జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు తెరకు పరిచయం అవుతుంది’ అన్నారు.