Janhvi Kapoor | ఏదో ఒక పోస్ట్‌తో సోషల్ మీడియాను హీటెక్కించే భామల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది జాన్వీకపూర్ (Janhvi Kapoor) . ఈ బ్యూటీ నెట్టింట ఫొటో పెట్టిందంటే చాలు లెక్కపెట్టలేనన్ని లైకులు, కామెంట్స్ వస్తుంటాయి. గ్లామరస్ పాత్రలతో మెస్మరైజ్ చేస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది జాన్వీకపూర్. ఈ అందాల తార ప్రస్తుతం కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30లో నటిస్తోన్న విషయం తెలిసిందే. దేవర (Devara)టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండే జాన్వీకపూర్.. టైం దొరికితే వెకేషన్ టూర్ ప్లాన్ చేసుకుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ ఓ అందమైన ఐలాండ్ ప్రాంతంలో బోటు (yacht) షికారు చేసింది. ఫుల్ వైట్ షర్ట్‌లో బోటులో విహరిస్తూ.. సముద్ర అలలు, తీర ప్రాంత గాలులను ఆస్వాదిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. నీటిపై తేలిపోతూ.. హ్యాపీ మూడ్‌లో చిట్ అవుట్ అవుతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇంతకీ జాన్వీకపూర్ ఎక్కడికెళ్లిందనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది.
ఎన్టీఆర్ 30 నుంచి ఇప్పటికే విడుదలైన జాన్వీ కపూర్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. జాన్వీకపూర్ మరోవైపు అక్కినేని అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో కూడా కనిపించబోతున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు హిందీలో బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
ఫుల్ వైట్ షర్ట్‌లో బోటులో విహరిస్తూ..