Rajini Kanth | సూపర్‌స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి కాస్ట్ రివీల్ వరకు ప్రతీది ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతుంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్ కు వీర లెవల్లో అంచనాలు పెరగాయి. పదేళ్లకు పైగా సరైన హిట్టులేని రజనీకు జైలర్ మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. నెల్సన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒక పేరు మోసిన నాయకుడిని జైలు నుండి రక్షించడానికి ఒక పెద్ద ముఠా ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ వారికి అడ్డుగా ఒకరు నిలబడతారు. ఆ నిలబడే వ్యక్తే రజనీకాంత్. అసలు జైలులో ఉన్న నాయకుడు ఎవరు? ఆయన్ను తప్పించడానికి ఎందుకు ప్రయత్ని్స్తున్నారు? అనే కథనంతో ఈ సినిమా సాగుతుందని చెన్నై వర్గాల టాక్. తమిళనాట ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా 150 నిమిషాల రన్ టైమ్ తో ప్రదర్శితం కానుందని టాక్. ఆగస్టు 10న అత్యంత గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది.