జూన్ 2.. తెలంగాణకు స్వాంతంత్య్ర దినం. సమైక్య పాలకుల బానిస సంకెళ్లనుంచి బయటపడ్డరోజు. అమరుల ఆత్మబలిదానాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతోంది. పట్టువదలని విక్రమార్కుడిలా ఇటు సీమాంధ్ర నాయకులు, అటు కేంద్రంతో కొట్లాడి తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ నెటిజన్లు ట్విటర్లో ‘జై కేసీఆర్’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. గురువారం ఈ హాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. మొత్తం 72వేల మంది నెటిజన్లు ఈ హాష్‌ట్యాగ్‌తో హోరెత్తించారు. అలాగే, ‘తెలంగాణ ఫార్మేషన్ డే’ హాష్‌ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ హాష్‌ట్యాగ్‌తో 25వేల మంది ట్వీట్లు చేశారు. 60 ఏళ్ల తమ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు ట్వీట్లతో ధన్యవాదాలు తెలిపారు.