Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!
Jagtial Child | అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్‌మీడియాలో కావడంతో అధికారులు రంగంలోకి దిగి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెంటనే అమలు చేశారు. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులకు మూడేళ్ల బాలుడిని అప్పగించారు.
Jagtial Child | రెండునెలలుగా సాగుతున్న నిరీక్షణకు తెరపడింది. కన్నబిడ్డలా పెంచుకున్న చిన్నారి దూరమై గుండెకోత అనుభవిస్తున్న ఆ దంపతుల ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది అంటూ చిన్నారి ఏడ్చిన వీడియో సోషల్‌మీడియాలో కావడంతో అధికారులు రంగంలోకి దిగి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెంటనే అమలు చేశారు. జగిత్యాలకు చెందిన సరిత, శ్రీనివాస్ దంపతులకు అధికారులు మూడేళ్ల బాలుడిని అప్పగించారు. దీంతో తమ బిడ్డ తమ చెంతకు చేరడంతో ఆ దంపతులు ఆనందభాష్పాలు రాల్చారు. ‘న్యాయం గెలిచింది.. మానవత్వం నిలిచింది.. మీ సాయాన్ని ఈ జన్మలో మరిచిపోలేం’ అంటూ తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతానికి చెందిన సరిత, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును దత్తత తీసుకున్నారు. తల్లి మరణించిన ఆ చిన్నారిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కన్నబిడ్డకంటే ఎక్కువగా చూసుకుంటూ అతడితో విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ బంధువులు బాలుడి దత్తతపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు జోక్యం చేసుకొని సెప్టెంబరు 16న బాలుడిని దంపతుల నుంచి స్వాధీనం చేసుకుని కరీంనగర్ శిశుగృహకు తరలించారు. తమ బిడ్డను తమకు అప్పగించాలంటూ సరిత, శ్రీనివాస్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు పరిశీలించిన న్యాయస్థానం అక్టోబరు 16న బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
న్యాయం గెలిచింది
మానవత్వం నిలిచిందిమీ సాయం ఈ జన్మలో మరిచిపోలేము
బాబును మా దగ్గర లేకుండా చేసి 2 నెలలు అయింది
బాబు లేకుండా మేము చనిపోతామేమో అనుకున్నాం
మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు
– జగిత్యాల చిన్నారి తల్లితండ్రులు https://t.co/yiJJsInlym
— Telugu Scribe (@TeluguScribe) November 3, 2026
‘నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తోంది’
హైకోర్టు ఉత్తర్వులు వచ్చినప్పటికీ అధికారులు బాలుడిని అప్పగించడంలో జాప్యం చేయడంతో ఆ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బిడ్డను చూసేందుకు కరీంనగర్ శిశుగృహకు వెళ్లిన సందర్భంలో చిన్నారి వారిని చూడగానే కన్నీరుమున్నీరయ్యాడు. ‘డాడీ.. నేను వస్తా.. ఇంటికి తీసుకెళ్లు.. నాకు భయమేస్తోంది అమ్మా.. నన్ను తీసుకెళ్లు’ అంటూ తల్లిదండ్రులను చుట్టేసుకున్నాడు. చిన్నారి దీనస్థితిని చూసి ఆ దంపతులు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
కలెక్టర్ జోక్యంతో కదిలిన ప్రక్రియ
బాలుడిని అప్పగించడంలో జాప్యంపై సరిత, శ్రీనివాస్ దంపతులు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజావాణిలోనూ వినతిపత్రం అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కలెక్టర్ స్పందించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అనుమతి, ఇతర పరిపాలనాపరమైన ప్రక్రియల వల్లే కొంత జాప్యం జరిగిందని వివరించారు. ప్రక్రియను వేగవంతం చేసి బాలుడిని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. చివరకు నిన్న రాత్రి చిన్నారిని దంపతులకు అప్పగించారు. తమ బాబు తిరిగి ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. ఈ కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.
“నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది”
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!
Ramayana | ‘రామాయణ’కు పైరసీ భయం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముంబై హైకోర్టు!
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు
Radhika Apte | టాలీవుడ్ కథలపై రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు.. ‘లెజెండ్’ సినిమాను ఉద్దేశించేనా, నెటిజన్ల ఘాటు కౌంటర్లు!
Indian Navy | సముద్ర దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ.. ఇరాన్ ఫిషింగ్ షిప్, 20 మంది సిబ్బంది సేఫ్ రిలీజ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

