అతిగా నిద్రిస్తే అనర్థమే..!

నిత్యం ఎవరైనా సరే.. 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నిర్దేశించిన సమయం కాకుండా రోజూ అంతకన్నా ఎక్కువ గంటలపాటు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్నారు. అంటే 8 గంటలకు పైగా నిద్రించే వారన్నమాట. ఈ క్రమంలోనే మన శరీరానికి నిద్ర అవసరమే అయినా అది ఎక్కువైతే మాత్రం ఎలాంటి లాభాలు కలగకపోగా అన్నీ నష్టాలే కలుగుతాయి. మరి అతిగా నిద్రిస్తే ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
అతిగా నిద్రించడం వల్ల బరువు పెరుగుతారు. శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది.
తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
డిప్రెషన్, మానసిక సమస్యలు, గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.
ఎప్పుడూ విపరీతమైన అలసట ఉంటుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. చిన్న పని చేసినా అలసిపోతుంటారు.
వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ సంతాన సాఫల్యత సమస్యలు వస్తాయి.
నిత్యం అతిగా నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

