Prabhas-Maruthi Movie | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఏ షూటింగ్లో ప్రత్యక్షమవుతున్నాడో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇక ప్రభాస్ లైనప్‌లో ఇప్పటికే బోలెడన్ని సినిమాలున్నాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఇండియాలోనే ఎక్కువ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన హీరో ప్రభాస్ ఒక్కడే అయ్యింటాడు. ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరర్ డ్రామా ఒకటి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. అయితే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాకు కూడా మొదటి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో వీఎఫ్ఎక్స్పై మరింత దృష్టి పెట్టాలని ఏకంగా 6నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ఇక రాజాడిలక్స్ విషయంలో కూడా అలానే జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా సీ.జీ వర్క్ ఎక్కువగా ఉందట. ఇప్పటి వరకు పావు వంతు కూడా షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుంటే పనులను వేగవంతం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో సీ.జీ వర్క్‌కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతారు. దాంతో సీ.జీ పేలవంగా వస్తే మళ్లీ దానికి మెరుగులు దిద్ధాల్సి ఉంటుందని ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. లేటైనా పర్లేదు కానీ మంచి అవుట్ పుట్తో రావాలని ఫ్యాన్స్ చిత్రబృందాన్ని కోరుతున్నారు.
హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. రాజా డిలక్స్ అనే థియేటర్ చుట్టు తిరిగే తాతా-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందట. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.