అమర్దీప్, తన్వినెగ్గి, ఎస్తేర్, అరుణ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐరావతం’. సుహాస్మీరా దర్శకత్వం వహిస్తున్నారు. రాంకీ పలగాని, లలితకుమారి తోట, బాలయ్యచౌదరి నిర్మాతలు. బుధవారం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. ఐరావతం పేరు వెనకున్న రహస్యమేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది’ అని తెలిపారు. తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులున్న చిత్రమిదని, త్వరలో సినిమాను విడుదలచేస్తామని నిర్మాతలు చెప్పారు. రవీంద్ర, సంజయ్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్య
కశ్యప్.