
అమర్దీప్, తన్వి, అరుణ్, ఎస్తేర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘ఐరావతం’. సుహాన్ మీరా దర్శకుడు. రాంకి పలగాని, లలిత కుమారి తోట, బాలయ్య చౌదరి చల్లా నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ‘ఓ నా దేవేరి’ అనే లిరికల్ వీడియోను బిగ్‌బాస్-5 టీమ్ సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, కాజల్‌లు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ ‘ఓనా దేవరి’ అనే పాట మెలోడియస్గా ఉంటుంది. రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో ఐరావతం టైటిల్ పాత్ర ఎవరిది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా వుంచాం. ఈ చిత్రంలో ఉండే వైట్కెమెరా క్లిక్ చేస్తే వచ్చే ఇబ్బందులు ఏమిటి? అనేది ఆసక్తికరంగా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య కాశ్యప్.