IPL | DC vs RR | దుబాయ్‌లోని అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ విసిరిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బ్యాటర్లు ముప్పుతిప్పలు పడ్డారు. సంజు శాంసన్ మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది. కెప్టెన్ శాంసన్ ఒక్కడే (70) ఒంటరిగా పోరాడాడు.
అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఢిల్లీ తరఫున అత్యధికంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 43 పరుగులు చేశాడు.
ఢిల్లీ బ్యాటింగ్
పృథ్వీ షా 10, ధవన్ 8, శ్రేయస్ అయ్యర్ 43, పంత్ 24, హెట్మెయిర్ 28, లలిత్ యాదవ్ 14, అక్షర్ పటేల్ 12, అశ్విన్ 6*, ఎక్స్ ట్రాలు 9
రాజస్థాన్ బౌలింగ్
ముస్తాఫిజుల్ 2 వికెట్లు, చేతన్ సకారియా 2 వికెట్లు, కార్తిక్ త్యాగి 1 వికెట్, రాహుల్ తివాతియా 1 వికెట్
రాజస్థాన్ బ్యాటింగ్
లివింగ్ స్టోన్ 1, యశస్వి జైస్వాల్ 5, సంజు శాంసన్ 70*, మిల్లర్ 7, మహిపాల్ లామ్రోర్ 19, రియాన్ పరాగ్ 2, రాహుల్ తివాతియా 9
ఢిల్లీ బౌలింగ్
అన్రిచ్ నార్ట్జ్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, అశ్విన్ 1 వికెట్