న్యూఢిల్లీ : ఐఫోన్ 14 సిరీస్‌ను కొద్దివారాల కిందట లాంఛ్ చేసిన యాపిల్ తాజాగా ఐఫోన్ 15పై దృష్టిసారించింది. ఐఫోన్ 15 సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్స్‌లోనూ డైనమిక్ ఐలండ్ ఫీచర్‌ను ఆఫర్ చేయనున్నట్టు సప్లయి చైన్ అనలిస్ట్ రాస్ యంగ్ వెల్లడించారు. ఐఫోన్ 15లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు పంచ్ హోల్ డిస్ప్లేను కలిగి ఉంటాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 14 ప్రొ మోడల్స్ తరహాలో ఐఫోన్ 15 సిరీస్‌లో అన్ని మోడల్స్‌లో నయూ డైనమిక్ ఐలండ్ ఫీచర్ ఉంటుందని భావిస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌లో పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లే ఉంటుంది. ప్రొ మోడల్స్‌లో న్యూ చిప్సెట్స్తో ముందుకొచ్చిన యాపిల్ ఐఫోన్ 15 మోడల్స్ అన్నింటిలో లేటెస్ట్ చిప్సెట్స్ను వాడనుంది.