న్యూఢిల్లీ : ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus)ను ఇప్పటివరకూ కొనుగోలు చేయని వారి కోసం ఈ హాట్ డివైజ్‌ను సొంతం చేసుకునేందుకు ఇప్పుడు సరైన అవకాశం ముందుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌పై ఐఫోన్ 14 ప్లస్ రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ వేరియంట్ రూ. 89,999 పలుకుతోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఈ డివైజ్‌పై రూ. 12000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
దీంతో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రూ 77,999కే అందుబాటులో ఉంది. ఇది ఐపోన్ 14 పోలిన తరహాలోనే ఉన్నా భారీ డిస్ప్లేతో ఇది ఆకట్టుకుంటుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపినవారికి డివైజ్‌పై మరో రూ. 4000 డిస్కౌంట్ లభిస్తంది. దీనికితోడు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఐఫోన్ 14 ప్లస్‌ను అతితక్కవ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 14 స్పెసిఫికేషన్స్నే ఐఫోన్ 14 ప్లస్ కలిగిఉండగా ఐఫోన్ 14 ప్లస్ భారీ డిస్ప్లే ఒక్కటే ఇరు స్మార్ట్ఫోన్ల మధ్య వ్యత్యాసంగా చెబుతున్నారు. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 6.7 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్ప్లేను కలిగిఉంది. తక్కువ ఖర్చుతో భారీ డిస్ప్లేతో కూడిన ఐఫోన్‌ను కోరుకునేవారికి ఐఫోన్ 14 ప్లస్ మెరుగైన ఛాయిస్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.