Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Bala Krsihna | నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే వార్త. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ భారీ సినిమాలో నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు బాలకృష్ణను చూడని సరికొత్త మాస్ అవతార్‌లో చూపించేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పొలిటికల్ అంశాలు, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని టాక్. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమా పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివతో చేయబోయే ప్రాజెక్ట్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కొరటాల శివ సినిమాలంటే గుర్తొచ్చేది బలమైన కథా నేపథ్యం. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన సామాజిక, రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. కథతో పాటు ఆ ప్రాంతపు సంస్కృతి, ప్రజల జీవనశైలి, సామాజిక పరిస్థితులను కూడా తెరపై అద్భుతంగా చూపించడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు బాలకృష్ణతో తెరకెక్కించబోయే సినిమా కోసం కూడా కొరటాల ఓ విభిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రాజకీయ అంశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రాధాన్యత ఉండనుందట. బాలయ్య అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్‌ను కూడా పుష్కలంగా జోడించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో యాక్షన్, రాజకీయ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా కొరటాల శివ పెద్దపీట వేయనున్నట్లు టాక్. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ కీలకంగా ఉండటంతో పాటు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారట. ‘దేవర’ సినిమా తర్వాత కొరటాల శివ తెరకెక్కించబోయే ప్రాజెక్ట్ కావడంతో ఈ కథపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథ, పాత్రను తీర్చిదిద్దేందుకు కసరత్తులు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు సమాచారం. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ కథా బలం కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. అయితే సినిమా టైటిల్, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

