
ఇల్లు కట్టాలంటే లోడ్లకొద్దీ సిమెంట్ బస్తాలు..ఇసుక, ఇటుకలు కావాలి. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ఇల్లు కట్టి చూడు.. పెళ్లిచూసి చూడు అని ఓ సామెత కూడా ఉంది. సొంతిల్లు కట్టాలనేది ఓ సగటు జీవి తన జీవిత లక్ష్యంగా పెట్టుకుంటున్నాడంటే అది ఎంత ఖర్చు, శ్రమతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే, కేవలం ఐదు సిమెంట్ బస్తాలు, ఒక టన్ను ఇసుక, ఓ మూడువేల ఇటుకలతో ఓ సగటు జీవి తన జీవితలక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. అది ఎలా సాధ్యమంటారా? అయితే, ఈ వీడియో చూడండి.