సుమన్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’.సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ….‘నేను దిల్ రాజు గారి సంస్థలో పనిచేశాను. రామాయణ గాథ స్ఫూర్తితో ఈ సినిమా కథను రాసుకున్నాను. నల్గొండలో సంచలనం కలిగించిన ఓ ప్రేమ కథ ఘటన అంశాలనూ ఇందులో చేర్చాం’.అన్నారు. ఈ చిత్రంలో నాగినీడు, రచ్చ రవి, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.