న్యూఢిల్లీ: లడాఖ సరిహద్దుల్లో చైనా చేపడుతున్న నిర్మాణాలపై అమెరికా టాప్ జనరల్ ఛార్లెస్ ఏ ఫ్లిన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. చాలా ఆందోళనకర రీతిలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్‌గా ఉన్న ఛార్లెస్.. చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చైనా విధానాలు ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉన్నాయని, ఆ దేశ ప్రవర్తన ఆమోదయోగంగా లేదన్నారు. హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో చైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.