హనుమకొండ, జూన్ 19: : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్‌రావు అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ శుక్రవారం హనుమకొండలోని కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించా రు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేశ్, సీపీఎం జిల్లా నాయకు డు ఎం చుకయ్య అధ్యక్షతన నేతృత్వంలో జరిగిన ధర్నాకు గుడిసెవాసులతోపాటు వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తకళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ భూపోరాటాల ద్వారా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని దశాబ్దాలుగా నివాసముంటున్న నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఓ వైపు పేదలకు గూడు లేక ఇబ్బంది పడుతుంటే, మరోవైపు విలువైన ప్రభుత్వ భూములు ల్యాండ్ మా ఫియా పరం అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి హనుమకొండ జిల్లాలోని అర్హులైన ప్రతి పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించేందుకు పకా ఇల్లు లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలతోపాటు పకా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు,కర్రె భిక్షపతి, జీ ప్రభాకర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మండల కార్యదర్శులు ఎన్ అశోక్, స్టాలిన్, కార్యవర్గ సభ్యులు ఉటూరి రాములు, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, జకు రాజు గౌడ్, నేదునూరి రాజమౌళి, వేల్పుల సారంగపాణి, బత్తిని సదానందం, రాసమల్ల దీన, సీపీఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, వీరన్న, మంద సంపత్, గొడుగు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.