న్యూఢిల్లీ: నెదర్లాండ్స్ అంబాసిడర్‌కు ఇండియా క్లాస్ పీకింది. దేశ భక్తి గురించి తమకు పాఠాలు చెప్పవద్దు అని ఇవాళ ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఉక్రెయిన్ అంశంలో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొని ఉంటే బాగుండేదని అంబాసిడర్ కారెల్ వాన్ ఊస్టోరమ్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. దానికి యూఎన్ అంబాసిడర్ టీఎస్ తిరుమూర్తి స్పందించారు. దేశభక్తి గురించి తమకు చెప్పాల్సిన అవసరం లేదని, ఇండియాకు ఏం చేయాలో తెలుసు అని ఆయన ఓ ట్వీట్లో తెలిపారు.
ఇవాళ యూఎన్ అసెంబ్లీలోనూ తిరుమూర్తి మాట్లాడారు. ఇండియా శాంతిని ఆకాంక్షిస్తోందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, ఈ యుద్ధం వల్ల ప్రభావానికి గురైనవాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారని తిరుమూర్తి ఇండియా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దౌత్యం ఒక్కటే చివరకు సమస్యను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. బుచాలో జరిగిన మారణకాండను ఇండియా ఖండించిందన్నారు. అంతర్జాతీయ దర్యాప్తును కోరిందన్నారు.
India remains on the side of peace & therefore believes that there will be no winning side in this conflict & while those impacted by this conflict will continue to suffer, diplomacy will be a lasting casualty, says @IndiaUNNewYork @ambtstirumurti at UNSCpic.twitter.com/R6W9LtWFv9
— Sidhant Sibal (@sidhant) May 6, 2022