న్యూఢిల్లీ, మార్చి 27: డిజిటల్ మీడియా అంచనాలకుమించి రాణిస్తున్నది. 2024లో టెలివిజన్ రంగాన్ని అధిగమించి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో అతిపెద్ద సెగ్మెంట్‌గా అవతరించినట్లు ఫిక్కీ-ఈవై నివేదికలో వెల్లడించింది. మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగాల్లో వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ మీడియా రంగ వాటా 32 శాతంగా ఉన్నదని పేర్కొంది.
ఇదే క్రమంలో 2026లో డిజిటల్ మీడియా లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనావేస్తున్నది. ఇదే క్రమంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 2024లో ఇది రూ.2.5 లక్షల కోట్లు.