న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి
- హర్మన్ మెరిసినా..
- మహిళల వన్డే ప్రపంచకప్
భారీ లక్ష్యఛేదనలో హర్మన్‌ప్రీత్ కౌర్ దంచికొట్టినా.. భారత మహిళల జట్టుకు పరాజయం తప్పలేదు. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసి మంచి జోష్‌లో ఉన్న మిథాలీ బృందానికి.. న్యూజిలాండ్‌తో మలి పోరులో ఓటమి ఎదురైంది. తొలుత బౌలర్లు సమిష్టిగా సత్తాచాటినా.. ఆనక బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలమవడం టీమ్ఇండియాను దెబ్బకొట్టింది.
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘనంగా బోణీ కొట్టిన భారత జట్టుకు.. రెండో మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాటర్‌వైట్ (75; 9 ఫోర్లు), అమెలియా కెర్ (50; 5 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. మన బౌలర్లలో పూజ వస్ర్తాకర్ నాలుగు, రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 46.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (63 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (31), యస్తిక భాటియా (28) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో లియా తహుహూ, అమెలియా కెర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మెగా టోర్నీ ప్రారంభానికి నెలన్నర ముందే న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్.. ఆతిథ్య జట్టు చేతిలో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-4తో ఓడిన విషయం తెలిసిందే. అచ్చం ఆ సిరీస్‌కు యాక్షన్ రీప్లేలా సాగిన పోరులో భారత అమ్మాయిలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్టార్ ఓపెనర్ స్మృతి మందన, దీప్తి శర్మ, రిచా ఘోష్, పూజ వస్ర్తాకర్, స్నేహ్ రాణా బ్యాటింగ్‌లో విఫలం కావడం భారత అవకాశాలను దెబ్బతీసింది. సాటర్వైట్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. తదుపరి పోరులో శనివారం వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఈ మెగాటోర్నీలో ప్రస్తుతం 2 పాయింట్లు ఖాతాలో ఉన్న మిథాలీ బృందం ఐదో స్థానానికి పడిపోయింది.
జులన్ @ 1
భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి.. మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన లియాన్ ఫుల్స్టోన్ (ఆస్ట్రేలియా; 39) రికార్డును సమం చేసింది. ఐదోసారి మెగాటోర్నీ బరిలోకి దిగిన జులన్ కివీస్‌తో పోరులో ఒక వికెట్ పడగొట్టడం ద్వారా ఈ ఘనత సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 260/9 (సాటర్‌వైట్ 75, అమెలియా 50; పూజ 4/34, రాజేశ్వరి 2/46), భారత్: 46.4 ఓవర్లలో 198 ఆలౌట్ (హర్మన్‌ప్రీత్ 71, మిథాలీ 31; తహుహూ 3/17).
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

