ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లో 450 టన్నుల సరఫరా : రైల్వే
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లో 450 టన్నుల సరఫరా | కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేగంగా, తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ సరఫరా చేసేందుకు రైల్వే ప్రత్యేకంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోంది. మంగళవారం ఉదయం వరకు దాదాపు 450 టన్నుల ఆక్సిజన్‌ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది. 90 టన్నులకుపైగా ఆక్సిజన్ లోడెడ్ ట్యాంకర్లు బొకరో నుంచి జబల్పూర్, భోపాల్ సమీపంలోని మందదీప్ వరకు, ఉత్తరప్రదేశ్‌కు ఆక్సిజన్ తీసుకువచ్చేందుకు మూడు ట్యాంకర్లు బొకరోకు వెళ్తున్నాయని చెప్పింది.
మంగళవారం 65 టన్నుల ప్రాణవాయువుతో మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధానికి చేరుకుందని రైల్వే చెప్పింది. దేశవ్యాప్తంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ), ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేసేందుకు మరికొన్ని రోజులు రోల్ ఆన్ రోల్ ఆఫ్ ప్రాతిపదికన రైళ్లను నడుపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఎల్ఎంఓను వైద్య సంబంధిత అవసరాల కోసం మాత్రమే అనుమతిస్తామని హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్‌లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

