టెల్ అవీవ్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. విమానం గాల్లో ఉండగా, పైలట్‌పై కోపైలట్ కత్తితో దాడి చేసి, విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కత్తిపోట్లకు గురైనప్పటికీ భారత్‌కు చెందిన పైలట్ స్మిత్ మచ్చర్ ప్రయాణికుల సహాయంతో కోపైలట్‌ను కట్టడి చేశారు. అనంతరం విమానాన్ని సౌదీలోని తబుక్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కోపైలట్ ఒమన్ జాతీయుడని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు. వీరిలో చాలామంది ఇజ్రాయెల్ పౌరులే. భారత పైలట్ ధైర్య సాహసాలతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే 2001లో యూఎస్‌లో జరిగిన 9/11 తరహా విషాదం చోటుచేసుకునేదని ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నిందితుడిని సౌదీ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు.
విమానం మార్గమధ్యంలో ఉండగా కాక్‌పిట్‌లో అరుపులు, కేకలతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విమానం 33 వేల అడుగుల ఎత్తు నుంచి హఠాత్తుగా 17 వేల అడుగుల కిందకు దిగింది. తొలుత అత్యవసర పరిస్థితిని సూచించే సంకేతం, తర్వాత హైజాక్ జరిగినట్టు పేర్కొనే సంకేతాన్ని పంపింది. దీంతో విమానం హైజాక్ అయినట్టు అధికారులు అనుమానించారు. ఈ సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ రెండు ఫైటర్ జెట్లను సహాయంగా పంపింది. అప్పటికే పైలట్‌పై కోపైలట్ కత్తితో దాడి చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రయాణికులు కూడా పైలట్‌కు సహకరించి కో-పైలట్‌ను అడ్డుకున్నారు. తర్వాత వారిద్దరినీ కాక్‌పిట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. కో-పైలట్ విమానాన్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించగా, పైలట్ దానిని ప్రయాణికుల సహాయంతో ఎదుర్కొన్నట్టు అధికారులకు సమాచారం అందింది. ఈ ఘటన అనంతరం విమానాన్ని ఉత్తర సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. విమానంలో సివిల్ దుస్తుల్లో ఉన్న రెండో టీమ్ పైలట్లు దానిని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. తీవ్రంగా గాయపడి ఉన్న పైలట్, కో-పైలట్లను దవాఖానకు తరలించినట్టు తబుక్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం జరిగిన ఘటన పూర్తి స్థాయి ఉగ్రదాడిగా పరిగణిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రయాణికుల విమానం హైజాక్‌కు గురయ్యే అవకాశం ఉండటంతో తాము రెండు యుద్ధ విమానాలను రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు పైలట్లను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ప్రయాణికులను సురక్షితంగా దేశానికి రప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. ఒక పైలట్ మరో పైలట్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం అందిందని నెతన్యాహు తెలిపారు.