ఎడ్మంటన్ : కారుపై మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన భారతీయుడు హత్యకు గురయ్యారు. కెనడాలోని ఎడ్మంటన్‌లో ఈ నెల 19న అర్వి సింగ్ సగూ (55) తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేశారు. హోటల్ నుంచి తిరిగి వస్తూ, తన కారుపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండటాన్ని గమనించారు. ‘ఏం చేస్తున్నావ్” అని ఆ వ్యక్తిని సగూ అడిగారు.
అందుకు ఆ వ్యక్తి బదులిస్తూ, ‘నాకు కావలసింది’ అన్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి హఠాత్తుగా సగూ వద్దకు వచ్చి, ఆయన తలపై బలంగా కొట్టాడు. దీంతో సగూ కింద పడిపోయారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్ 911కు ఫోన్ చేశారు. పారామెడిక్స్ వచ్చేసరికి సగూ అపస్మారక స్థితిలో ఉన్నారు.