గుంటూరు: ఉక్రెయిన్ నుంచి బయటపడటానికి ఎంతో మంది భారతీయులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, తాను ప్రేమగా పెంచుకొంటున్న జంతువులను వదిలి ఒంటరిగా భారత్ రాబోనని ఏపీలోని తణుకుకు చెందిన డాక్టర్ గిరికుమార్ పాటిల్ తేల్చిచెబుతున్నారు. డోన్బాస్లోని ఓ బంకర్లో ప్రస్తుతం అయన ఉన్నారు. మరి పాటిల్ ప్రేమగా పెంచుకొంటున్న జంతువులు ఏంటో తెలుసా? పులులు. నిజం. పాటిల్ మూడు ఇటాలియన్ కుక్కలతో పాటు జాగ్వార్, నల్ల చిరుతను కూడా పెంచుకొంటున్నారు. కాగా, కుక్కలను తరలించడానికి ప్రభుత్వం అంగీకరించవచ్చని, అయితే పాటిల్ పెంచుకొంటున్న రెండు పులులను తరలించడం కుదరకపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.