సూపర్ 12లో లాస్ట్ మ్యాచ్ త్వరలో ప్రారంభం కానుంది. భారత్, నమీబియా మధ్య పోరు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు 4 టీమ్‌లు వెళ్లిపోయాయి. కాకపోతే.. పాయింట్స్ టేబుల్లో తమ స్థాయిని మార్చుకోవడం తప్పితే.. ఏ టీమ్‌కు కూడా ఈ మ్యాచ్‌ను గెలవడం వల్ల ఉపయోగం లేదు. రెండు టీమ్స్.. ఈ మ్యాచ్ ముగిశాక ఇంటి దారి పట్టాల్సిందే.
ఈరోజు మ్యాచ్‌లో టీమిండియా నుంచి ఒకే ఒక్క మార్పు చోటు చేసుకుంది. వరుణ్ చక్రవర్తి స్థానంలో రాహుల్ చాహర్ బరిలోకి దిగనున్నాడు. నమీబియా టీమ్‌లో బిర్కెన్‌స్టాక్ బదులు ఫ్రైలింక్ బరిలోకి దిగనున్నాడు.
సెమీ ఫైనల్స్‌కు గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్వాలిఫై కాగా.. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యాయి. నవంబర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ పోరు జరగనుంది. నవంబర్ 11న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ పోరు ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్స్ మధ్య పైనల్ పోరు నవంబర్ 14న జరగనుంది.
Toss news from Dubai 🪙
— T20 World Cup (@T20WorldCup) November 8, 2021
India have won the toss and will field first.#T20WorldCup | #INDvNAM | https://t.co/ICh1BVKEFJ pic.twitter.com/SmN1YLWHFT