దేశంలో 24 గంటల్లో కరోనాతో 354 మంది మృతి
354 మంది మృతి | గడిచిన 24 గంటల్లో వైరస్ ప్రభావంతో 354 మంది మృత్యువాత పడ్డారని కేంద్రం పేర్కొంది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మరణాలు సైతం భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,480 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 41,280 మంది కోలుకోగా.. వైరస్ ప్రభావంతో 354 మంది మృత్యువాత పడ్డారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.
ఇప్పటి వరకు 1,14,34,301 మంది కోలుకోగా.. మొత్తం 1,62,468 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా 6,30,54,353 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశంలో 10,22,915 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24.36 కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
డ్రగ్ ట్రాఫికింగ్.. అధ్యక్షుడి సోదరుడికి జీవితఖైదు శిక్ష
కరోనా కలకలం.. ఐఐటీ జోధ్పూర్ లో 25 మందికి పాజిటివ్
తెలంగాణలో కొత్తగా 684 కరోనా కేసులు
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్లో లాక్డౌన్ రద్దు
నేడు భారత్కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

