దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ 4వేలు దాటిన మరణాలు | దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణ మృందం మోగిస్తున్నది. గడిచిన కొద్ది రోజులు కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది. తాజాగా దేశంలో 2.22లక్షల కొవిడ్ కేసులు నమోదవగా.. మరోసారి మరణాలు 4వేలు దాటాయి. కొత్తగా నమోదైన మరణాలతో దేశంలో కరోనా మరణాలు మూడులక్షల మార్క్‌ను దాటాయి. కరోనా మరణాల్లో భారత్ ప్రపంచంలో మూడోస్థానంలో కొనసాగున్నది. అమెరికా, బ్రెజిల్ తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో 2,22,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. మరో వైపు రోజువారీ కేసుల కంటే భారీగానే బాధితులు వైరస్ నుంచి కోలుకుంటున్నారు. నిన్న 3,02,544 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని మంత్రిత్వశాఖ పేర్కొంది. 24 గంటల్లో మరో 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447కు పెరిగింది. ఇప్పటి వరకు 2,37,28,011 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్ బారినపడి మొత్తం 3,03,720 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 88.30శాతం, మరణాలు రేటు 1.13శాతం ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 19,28,127 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిప్పింది. ఇప్పటి వరకు 33,05,36,064 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
బర్త్‌డే వేడుకల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
బద్రీనాథ్ ఆలయంలో మంత్రి పూజలు.. పూజారుల ఆగ్రహం
ఉత్తరాఖండ్‌లో భూకంపం
1 నుంచి పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్!
24-05-2021 సోమవారం.. మీ రాశి ఫలాలు
బద్దలైన ఇరగోంగో అగ్నిపర్వతం.. 11 మంది మృతి
డిసెంబర్ నాటికి భారతీయులందరికీ వ్యాక్సిన్ : కేంద్రమంత్రి
కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

