పనజీ: ఇండియాలో తొలి సెక్స్ టాయ్ షాప్‌గా నిలిచిన కామా గిజ్మోస్ మూతపడింది. గత నెల వాలెంటైన్స్ డే సందర్భంగా గోవాలోని కలంగూట్‌లో ఈ స్టోర్ ఓపెన్ అయింది. అయితే స్థానిక పంచాయతీ మాత్రం దీనికి అభ్యంతరం చెప్పడంతో నెల రోజుల్లోనే షాపును మూసేశారు. షాపు లైసెన్స్‌తోపాటు అది అమ్మే వస్తువులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కలంగూట్ పంచాయతీ దుకాణాన్ని మూసేయాల్సిందిగా ఆదేశించింది. దేశంలోనే తొలి సెక్స్ టాయ్ షాప్‌గా నిలిచిన దీనిని లైంగిక సంరక్షణ స్టోర్ల సంస్థ అయిన కామాకార్ట్, ఆన్లైన్ సెక్స్ టాయ్ స్టోర్ గిజ్మోస్వాలా కలిసి ప్రారంభించాయి. లైసెన్స్ సమస్యలు ఉండటంతోపాటు స్థానికులు తనకు ఫిర్యాదు చేసినట్లు కలంగూట్ సర్పంచ్ దినేష్ సైమ్పురస్కార్ చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలను తాము అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.