Afghanistan | భారత్ నుంచి కాబూల్‌కు ప్రతి రోజూ రెండు విమానాలు
Afghanistan | భారత్ నుంచి కాబూల్‌కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. శనివారం

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత.. కాబూల్‌లోని విమానాశ్రయంలో కార్యకలాపాలు అమెరికా నాటో బలగాల నియంత్రణలో ఉన్నాయి. శనివారం కాబూల్‌కు ప్రతిరోజూ రెండు భారతీయ విమానాలు నడపడానికి బలగాలు భారత్‌కు అనుమతి ఇచ్చాయి. నాటో దళాలు.. తమ ఆయుధాలు, పౌరులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోజుకు మొత్తం 25 విమాన సర్వీసులను నడుపుతున్నాయి.
భారతీయ వైమానిక దళం (IAF) రవాణా విమానం కాబూల్ విమానాశ్రయం నుంచి కొంతమంది ఆఫ్ఘన్ ప్రముఖులు, హిందూ, సిక్కు ప్రజాప్రతినిధులతో పాటు విమానంలో 85 మంది భారతీయులు ఆదివారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించింది. అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాబూల్ సహా దాదాపు అన్ని కీలక పట్టణాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- allowed
- America
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

