అనధికారిక టెస్ట్ ‘డ్రా’

బ్లూమ్ఫాంటైన్: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు ‘డ్రా’గా ముగిసింది. నాలుగో రోజు శుక్రవారం వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి మెరుగైన స్థితిలో ఉన్న భారత్ ఆఖరి రోజు వరుణుడి కారణంగా బరిలోకి దిగకుండానే మ్యాచ్ ముగిసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నా భారత్ ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది.
టీమ్ఇండియా తరఫున బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ (103) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా-‘ఎ’ 509/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ఈనెల 29న ప్రారంభం కానుంది. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభణతో మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా ‘ఎ’: 135.3 ఓవర్లకు 509/7 డిక్లేర్డ్ (పీటర్ మలన్ 163, టోనీ జార్జి 117; సైనీ 2/67, అర్జాన్ 2/75)
భారత్ ‘ఎ’: 93.1 ఓవర్లకు 308/4. (అభిమన్యు 103, ప్రియాంక్ 96, పృథ్వీ షా 48).
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

