Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
Kiran Komrewar | వృద్ధాప్య, బీడీ కార్మికుల కొత్త పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ డిమాండ్ చేశారు.
కుభీర్ : వృద్ధాప్య, బీడీ కార్మికుల కొత్త పెన్షన్లను ( New Pensions ) వెంటనే మంజూరు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ( Kiran Komrewar ) డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్లను నెలకు రూ.4వేలకు పెంచాలని కోరారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
యూత్ డిక్లరేషన్ ( Youth Declarations ) లో ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందిస్తామని గొప్పలు చెప్పుకొని మోసం చేశారని అన్నారు. దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందించ లేదని ఆరోపించారు. తక్షణమే రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేసి అర్హులైన యువతకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
అనారోగ్యంతో ఇంటి వద్ద కోలుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు గంధం పోశెట్టి ఆయన పరామర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఎన్నిల అనిల్, మాజీ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్, ఉద్యమ నాయకులు పుప్పాల పీరాజీ, దత్తు సింగ్, వార్డు సభ్యుడు నాగేష్, పల్సి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు నిమ్మ లక్ష్మణ్, మెంచు రాములు, భోజారాం పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Komrewar | పెన్షన్లు పెంచాలి.. రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి : కిరణ్ కొమ్రేవార్
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి : కలెక్టర్ అంకిత్
దీక్షా దివస్ను విజయవంతం చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Sneha Shabarish | పిల్లలను ఎందుకు నిలబెట్టారు.. అధికారులకు కలెక్టర్ స్నేహ శబరీష్ వార్నింగ్.. వీడియో
Adilabad | కరువు మండలంగా ప్రకటించాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన రైతు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

