నాలుగు స్లాబుల్లో చెల్లింపు: ఆయిల్‌ఫెడ్ చైర్మన్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్‌పామ్ రైతులకు ఉపశమనం కలిగించేం దుకు ఆయిల్‌పామ్ గెలల రవాణా చార్జీలను పెంచుతున్నట్టు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గతంలో రవాణా చార్జీలు మూ డు స్లాబుల్లో ఉండగా నాలుగు స్లాబులకు పెంచినట్టు సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. 0-15 కిలోమీటర్లకు రూ.285 నుంచి రూ. 370కి, 15-30 కిలోమీటర్లకు రూ.415 నుంచి రూ.460కి, 31-50 కిలోమీటర్లకు రూ.415 నుంచి రూ.560కి, 50 కిలోమీటర్ల పైన దూ రానికి రూ.645 నుంచి రూ.750కి పెంచినట్టు తెలిపారు. దేశంలో అత్య ధిక నూనె రికవరీ (19.11) శాతాన్ని ఆయిల్‌ఫెడ్ సాధించిందన్నారు. ఈ ఏడాది ఆయిల్‌ఫెడ్ 2.29 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలలను ప్రాసెస్ చేసిందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో ఆయిల్‌పామ్ రైతులకు టన్నుకు రూ.17,293 ధరను ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్, జీఎం సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.