‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరు నిత్యం యోగా సాధన చేయడం అలవర్చుకోవాలని ప్రముఖ యోగ గురువు, విశ్రాంత ఉపాధ్యాయుడు మాదగాని శంకరయ్య, డీవీఎం విద్యా సంస్థల కరస్పాండెంట్ దొడ్లా శాంతికుమార్ అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల...
– ప్రముఖ యోగా గురువు మాదగాని శంకరయ్య, కరస్పాండెంట్ దొడ్డా శాంతి కుమార్
రామగిరి, నవంబర్ 02 : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరు నిత్యం యోగా సాధన చేయడం అలవర్చుకోవాలని ప్రముఖ యోగ గురువు, విశ్రాంత ఉపాధ్యాయుడు మాదగాని శంకరయ్య, డీవీఎం విద్యా సంస్థల కరస్పాండెంట్ దొడ్లా శాంతికుమార్ అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ ప్రథమ సంవత్సవరం విద్యార్థులకు సయోగా హెల్త్ అండ్ వెల్బేయింగ్’ అనే సబ్జెక్టుపై నిర్వహించిన ఓరియేంటేషన్కు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తొలుత యోగా సబ్జెక్టు విశిష్టతో పాటు సిలబస్‌ను వివరించారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారంతో పాటు పలు యోగాసనాలను వేయించారు. కళాశాల యోగా అధ్యాపకుడు మేడిపల్లి రవి ఆధ్వర్యంలో శంకరయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు. ఈ కార్యక్రమంలో డీవీఎం విద్యా కళాశాల ప్రిన్సిపాల్ బొళ్ల నారాయణరెడ్డి, డీఆర్ఎం కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్రీదేవి, ఎంఈడీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బొడ్డుపల్లి రామకృష్ణ, డీవీఎం విద్యా సంస్థల సూపరింటెండెంట్ చోల్లేటి శ్రీధరాచారి, సీనియర్ అధ్యాపకులు రావిరాల సత్యనారాయణ, ఎ.సరిత, వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ పి.శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

