శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్కుమార్, కిరణ్, ఇనయసుల్తాన ప్రధాన పాత్రల్లో భూమి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రమేష్ జక్కాల దర్శకుడు. లక్ష్మీప్రసన్నభూమి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి విష్ణుబొప్పన క్లాప్‌నివ్వగా రచయిత ప్రసన్నకుమార్ కెమెరా స్విఛాన్చేశారు. డైమండ్త్న్రబాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ ‘కుటుంబ విలువలతో ముడిపడిన ప్రేమకథా చిత్రమిది. స్వచ్ఛమైన ప్రేమ గొప్పతనాన్ని చాటుతుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఫిబ్రవరిలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. నటనకు ప్రాధాన్యమున్న మంచి పాత్రల్ని పోషిస్తున్నామని నాయకానాయికలు చెప్పారు.