వినీత్ కుమార్, జబర్దస్త్ నాగిరెడ్డి, జీవా, సీకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బెంగుళూరు హైవే’. ఈ చిత్రాన్ని ద్వివేది ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు వినీత్ కుమార్ రూపొందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. దర్శకుడు మాట్లాడుతూ..‘బెంగుళూరు హైవేపై జరిగిన యదార్థ కథ ఇది. క్రైమ్ హారర్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేస్తాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.