నగోయా: ఏషియన్ గేమ్స్(Asian Games)లో ఇవాళ ఇండియాకు మెడల్ వచ్చింది. షూటింగ్లో మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత బృందం రజత పతకాన్ని కైవసం చేసుకున్నది. షూటర్లు నీరూ, ఆషిమా అహ్లావత్, మనీషా కేర్ అత్యద్భుత ప్రదర్శన ఇచ్చారు. భారత బృందం ట్రాప్ టీమ్ ఈవెంట్లో 328 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్లో చైనా టాప్లో నిలిచింది ఆ జట్టు 346 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది. ఇక మూడో స్థానంలో కువైట్ నిలిచింది. ఆ జట్టుకు భారత్ కన్నా మూడు పాయింట్లు తక్కువగా వచ్చాయి.
భారత ట్రాప్ టీమ్ ఈవెంట్ బృందంలో షూటర్ నీరూ దండా మేటి ప్రదర్శన ఇచ్చింది. 125 పాయింట్లకు కాను ఆమె 118 పాయింట్లు సాధించింది. ఇక మరో షూటర్ అషిమాకు 106, మనీషాకు 104 పాయింట్లు వచ్చాయి. వ్యక్తిగత ఫైనల్ ట్రాప్ ఈవెంట్లోనూ భారత షూటర్ నీరూ దంఢా పోటీపడుతున్నది. ఆమెకు ఈ కేటగిరీలోనూ మెడల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Another medal for India in Shooting!
Congratulations to Neeru, Aashima Ahlawat and Manisha Keer on winning the Silver Medal in the Women’s Trap Team event at the Asian Games 2026.
A fine display of precision, composure and teamwork.
Jai Hind!
— Yogi Adityanath (@myogiadityanath) September 29, 2026