మరో క్రేజీ చిత్రంలో
అగ్ర తార రష్మిక మందన్న జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు. ‘పుష్ప’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ భామ…భారీ ఆఫర్లను ఖాతాలో వేసుకుంటున్నది. తాజాగా ఆమె ఓ క్రేజీ చిత్రంలో నాయికగా ఎంపికైనట్లు తెలుస్తున్నది. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్తో రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా రష్మికను తీసుకోనున్నట్లు సమాచారం. నాయిక కోసం ముందుగా పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి వారిని అనుకున్నా..ఆ అవకాశం రష్మికనే వరించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. పాండమిక్ వల్ల ఆలస్యమైన ఈ సినిమా ఉగాది రోజున సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇక బాలీవుడ్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది రష్మిక మందన్న. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ‘మిషన్ మంజు’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. జూన్ 10న ఈ సినిమా తెరపైకి వస్తున్నది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా భారత గూఢచారి సాహసాలను చూపించనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

